మన్యం న్యూస్ దుమ్ముగూడెం మే 31::
గోదావరి నదిలో నిబంధనకు విరుద్ధంగా ఇసుక అక్రమ చేస్తున్నారని సిపిఎంఎల్ ప్రజాపంతా మండల కార్యదర్శి నారాయణ అన్నారు. మండలంలోని రేగుబల్లి గ్రామంలో ఇసుక ర్యాంపును పరిశీలించిన ఆయన నిబంధనకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారని గోదావరి నది నుంచి స్టాక్ పాయింట్ భారీగా ఇసుకను ఏర్పరచుకొని భారీ యంత్రాల సహాయంతో లారీలతో తోలుకుంటున్నారని పేర్కొన్నారు ఇప్పటికే ఈ ర్యాంపుకి పర్మిషన్ టెర్మినేట్ అయిపోయిన ఇంకా తోలకాలు కొనసాగిస్తున్నారని సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .మండలంలో ఏర్పాటు చేసే ఇసుక ర్యాంపులకు స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా ఉండాలే తప్ప ఇలా భారీ యంత్రాలతో ఇసుక తోలకాలు కొనసాగించవద్దని హెచ్చరించారు .రేగుపల్లి ఇసుక ర్యాంపులు రోడ్డుకి అడ్డంగా లారీలు ఉండడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందని అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా దుమ్ముగూడెం మండల కార్యదర్శి సాయన్న పాల్గొన్నారు