UPDATES  

 రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 31

మణుగూరు మండలం లోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, ఆధ్వర్యంలో బుధవారం జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై వారి చేతుల మీదుగా జీలుగు విత్తనాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,ప్రభుత్వం సబ్సిడీలో రైతులకు జీలుగు విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం. నరసింహారావు,ఏ డి ఏ తాతారావు,ఏఈఓ వీరేంద్ర నాయుడు,సంఘ ఉపాధ్యక్షులు దొండేటి. రామ్మోహన్,సంఘ పాలకవర్గ సభ్యులు మామిడిపల్లి సీతారాములు,పిన్నమనేని మాధవి,గుమ్మల.రాంబాబు,తడికమల్ల జానికమ్మ,పప్పులు ప్రసాద్ బాబు,షేక్ అబ్బాస్ అలీ,దాచేపల్లి శంకర్,సంఘం మానిటరింగ్ అధికారి కే.రమేష్ సంఘ సీఈఓ టి.జ్ఞాన దాసు, సంఘ సిబ్బంది తాజుద్దీన్, రాఘవులు,సతీష్,రైతులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !