మన్యం న్యూస్ ఏటూరు నాగారం
గంగారం మండలం కేంద్రం లో వేల్పు జాతర లపై గత రెండు రోజులగా బిర్స ముండా రీసెర్చ్ సెంటర్ బృందం జరుపుతున్న పరిశోధనలో భాగంగా గుట్ట పై పురావస్తు గంగాలమ్మ దేవత విగ్రహం కట్టడాలు ఉన్నాయని జేజ్జరి , సిద్దబోయిన, యాప, ఇంటి పేర్లు గల పెద్ద మనుషులు చెప్పిన వివరాల ప్రకారం ఇక్కడికి చేరుకొని పరిశోదన నిర్వహించడం జరిగింది. అనంతరం తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.ఈ గుట్ట పై ఉన్న గంగళమ్మ విగ్రహం అతి ప్రాచీనమైనది అని క్రీస్తు పూర్వం కోయ రాజ్యాలు ఆదివాసీలు కోల్పోయిన తర్వాత దట్టమైన అడవుల ప్రాంతానికి వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో తమ వెంట తెచ్చుకున్న విగ్రహమే ఈ గంగలమ్మా విగ్రహం అన్నారు. ఈ గాంగలమ్మ పేరు మీదనే గంగారం అనే పేరు వచ్చిందని అన్నారు.ఈ పురాతన విగ్రహం పై ఉన్న చిత్ర లిపి లో రాయి బండానీ వంశం కి సంబందించిన గుర్తులు,5 వ గొట్టు అని తెలిపే 5 నిలువు గీతలు ఉన్నట్లు గుర్తించారు అందుకే నేటికీ కూడా 5 వ గట్టు జేజ్జారి వారే ఈ దేవుణ్ణి కొలుస్తున్నారు అని అన్నారు. గంగా లమ్మ 5 వ గొట్టు వారి కోడలు అని మేడారం సమ్మక్క కి తల్లి అని ఆ మూలం వివరాలు ఈ విగ్రహం పై చిత్ర లిపి లో ఉంది అన్నారు ఈ విగ్రహం చుట్టూ ప్రక్కల గుడి నిర్మాణం కి ఏర్పాటు చేసిన పురాతన బండ రాళ్ళు కూడా గుర్తించి వాటిపై అధ్యయనం చేసినట్టు తెలిపారు. గంగాలమ్మా అంటే నీటి ప్రవాహానికి సంకేతం అని
దొన గుట్ట కి గంగారం గ్రామం కి తూర్పు దిక్కున కొండ పైన ఒక దొన ( పెద్ద రంధ్రం) ఉంటుందని ఆ దొన లో గంగలమ్మ ఉండి చల్లని గాలి వీస్తుందని నమ్మకం అందుకే ప్రాంతం చల్లగా ఉంటుందని వర్ష కాలం లో కూడా ఈ ప్రాంతం మేగావృతం అవుతుందని అన్నారు.ఇదంతా ఆదివాసీలకు బంధించిన పకృతి జ్ఞానం అని అన్నారు. వర్షాలు పడని సమయం లో కూడా ఇక్కడి పెద్ద మనుషులు 5 గురు చిన్న పిల్లలను తీసుకెళ్లి అక్కడ దేవుని ముందు పడుకో పెట్టీ దేవర ముందు ఆవు పాలు పొంగిస్తే పొంగు వచ్చిన పక్కన వర్షాలు పడతాయని, పడుకున్న పిల్లలను రోహిణి మృగ శిర అరెద్ర పెద్ద పుషాలు, అసీలేరు గా పరిగణించి పిల్లలను వరుస క్రమం లో వర్షాలు ఎపుడు పడుతాయని అడిగితే వాలు చెప్పే కార్తి ని బట్టి వర్షాలు కురుస్తాయని అన్నారు.ఇదంతా పకృతి కి ఆదివాసీ జీవనం కి ఉన్న బంధం అని అన్నారు.ఇటు వంటి జాతరలు జ్ఞానం నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన పై ఉందని అన్నారు.
ఈ పరిశోదన లో రీసెర్చ్ సెంటర్ ఇంఛార్జి కొమరం జ్యోతిష్, పెద్ధ మనుషులు సిద్ధ బోయిన జజ్జరి పరిశోధక విద్యార్థులు కాక శ్వేత కాక నవ్య పాయం
నందిని తదితరులు పాల్గొన్నారు.