మన్యం న్యూస్,ఇల్లందు: ఇల్లందు పట్టణంలో బుధవారం జరిగిన వివాహ వేడుకలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మరియు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఇల్లందు పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, మండల కోఆప్షన్ సభ్యులు ఘాజీ, నాయకులు అబ్దుల్ నబి, బారాస యువజన అధ్యక్షులు మెరుగు కార్తీక్, ప్రచార కార్యదర్శి రాకేష్, బారాస విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేష్, శ్రీకాంత్, శ్రావణ్, వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.