మన్యం న్యూస్,ఇల్లందు:ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతమధు జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ తాతామధు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ తాతమధుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నిరంతర శ్రామికుడు ఎమ్మెల్సీ తాతామధు అని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనదైన ముద్రను చూపిన ఆయన రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులను అలంకరించాలని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీ పాషా, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, టీబీజీకేఎస్ ఇల్లందు ఉపాధ్యక్షులు రంగనాథ్ , బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యలమద్ది రవి, ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పివి కృష్ణారావు, టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మేకల్ శ్యామ్, 1వ వార్డు కౌన్సిలర్ వారా రవి, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, రాచపల్లి శ్రీనివాస్, రాఘవరపు రాకేష్, పాలడు రాజశేఖర్, నెమలి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.