మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 31
మణుగూరు మండలం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కరపత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆవిష్కరించడం జరిగింది.అనంతరం కళాశాల ప్రాంగణాన్ని అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.కాలేజీలు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు,ఎంపీఓ వెంకటేశ్వర్లు,మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, సర్పంచ్ బచ్చల భారతి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, కార్యదర్శి నవీన్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాదగిరిగౌడ్,ఎడ్లశ్రీను,రమేష్,శంకర్,రమణ,యువజన నాయకులు రవి ప్రసాద్,హర్ష నాయుడు,నవీన్ బాబు, రంజిత్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.