మన్యం న్యూస్, దమ్మపేట, మే, 31: మండల పరిదిలోని కొమ్ముగూడెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి తుమ్మల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం ఇంటికి బుధవారం వెళ్లడం జరిగింది. ఈ సందర్బంగా సోయం వీరభద్రం దంపతులు కుటుంబం సమేతంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావుకి పుష్పగుచ్ఛంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా నూతన దంపతులైన సోయం వీరభద్రం బావమరిది తాటి వీరభద్రం సమ్మక్క దంపతులను తుమ్మల ఆశీర్వదించారు. తుమ్మల, సోయం ఇద్దరూ వ్యవసాయ కుటుంబం నుండి రాజకీయాల్లోకి రావటం అందరకి తెలిసిందే అయితే సోయంతో తుమ్మల వ్యవసాయ సంబంధిత విషియాలు గురుంచి కొద్దిసేపు ముచ్చటించారు. వ్యవసాయం పై సుధీర్గా అనుభవం ఉన్నా మాజీ మంత్రి తుమ్మల వద్దా ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఉన్నా పామాయిల్, కొబ్బరి తోటలలో అంతరపంటలుగా కోకో, వక్క పంటలపై సుధీర్గంగా సలహలు, సూచనలు సోయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సోయం వీరభద్రం కుటుంబ సభ్యులు మరియు మన్నెం అప్పారావు, యర్రంశెట్టి భాస్కరరావు, కేసిని మధు, కాసాని నాగప్రసాద్, వాడే నరసింహారావు, సోయం గోపి, సోయం రమ్య, బీరవెల్లి ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.