మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 31
మణుగూరు మండలం గుట్ట మల్లారం నందు నూతనంగా ఏర్పాటు చేసిన సంతోష్ మోటార్స్ వారి మారుతి సుజికి షోరూం ను బుదవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.షోరూం యాజమాన్యానికి,సిబ్బందికి విప్ రేగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్భంగా షోరూం నిర్వాహకులు విప్ రేగా ను శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో జెడ్పీటీసీ పోశం.నర్సింహారావు,పిఏసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,డి ఎస్పీ రాఘవేంద్రరావు,ఎస్సై రాజకుమార్,స్థానిక ప్రజా ప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,కార్యదర్శి నవీన్, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.