అద్దె బస్సు కార్మికుల జీతాలు పెంచాలి.
– సీఐటియూ దశల వారీ పోరాటంతో దిగివచ్చిన అధికారులు.
– ఆర్టీసీ అధికారులు, జిల్లా కార్మిక శాఖ అధికారులతో చర్చలు ప్రారంభం.
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
గత నెల రోజుల నుంచి జీతాల పెంపు కోసం, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ అద్దె బస్సు కార్మికులు శాంతి యుతంగా పోరాటాలు చేస్తుంటే అద్దె బస్సు యజమానులు, ఆర్టీసీ అధికారులు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరు పై సిఐటియు నాయకులు లేబర్ ఆఫీసర్ ని కలవడం జరిగిందనీ యూనియన్ నాయకులు తెలిపారు. అద్దె బస్సు కార్మికులు చేస్తున్న పోరాటానికి చర్చలకు బస్సు యజమానులు సిద్ధం గా లేరని జిల్లా లేబర్ ఆఫీసర్ కి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందనీ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ తెలిపారు. కొంత మేరకు స్పందించిన ఆర్టీసీ అధికారులు వారి పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తామని లేబర్ ఆఫీసర్ ముందు చర్చ ల్లో చెప్పడం జరిగిందన్నారు. జీతాలు పెంపుదల పట్ల నిర్లక్ష్యం గా ఉన్న బస్సు యజమానులతో జూన్ ఆరవ తారికున ఆర్టీసీ డిపో మేనేజర్ వద్ద చర్చ లు ఉంటాయని జిల్లా లేబర్ ఆఫీసర్ శర్ఫుద్దిన్ ప్రకటించారు. ఈ చర్చల్లో ఆర్టీసీ సూపరిండెంట్ట్ విజయలక్ష్మి, సీనియర్ అసస్టెంట్ చారి, సీఐటీయూ, అద్దె బస్సుల నాయకులు భూక్యా రమేష్, నరసింహ, సైదులు, శ్రీకాంత్, నవీన్, ఆది నారాయణ, తదితరులు పాల్గొన్నారు.