మన్యం న్యూస్: జూలూరుపాడు, మే 31, మండల కేంద్రంలోని సాయి ఎక్స్ లెంట్ పాఠశాల విద్యార్థులు గురుకుల పాఠశాల 5వ తరగతి ప్రవేశ పరిక్ష ల్లో విజయకేతనం ఎగురవేశారు. గురుకుల పాఠశాలలో ఎంపికైన సాయి ఎక్స్ లెంట్ పాఠశాల విద్యార్థులను రిటైర్డ్ ఎంఈఓ మద్దిశెట్టి వెంకటేశ్వరరావు బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులకు విద్యను అందించిన పాఠశాల కరస్పాండెంట్ ఆరెబోయిన కృష్ణప్రసాద్ (కేపి) కృషిని ప్రశంసించారు. రిటైర్డ్ ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో జిల్లా స్థాయిలో సాయి ఎక్స్ లెంట్ స్కూల్ విద్యార్థుల్లో అత్యధికంగా ఎంపిక కావటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ పాఠశాల కరస్పాండెంట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తమ పాఠశాల నుండి 82 మంది విద్యార్థులు ఎంపిక కావటం జరిగిందని తెలిపారు. అలాగే తమ పాఠశాల విద్యార్థులకు ప్రాథమిక విద్యనుండి సక్రమంగా చదవడం, రాయడం విద్యా బోధనతోపాటు ప్రతి విద్యార్థి పోటీ, పరిక్ష రాసి విజయం సాధించే విధంగా మా పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేశారని తెలిపారు. మండలంలోని పేద విద్యార్థినీ, విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న నవోదయ, గురుకుల, సైనిక్ విద్యాలయాలు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక క్లాసులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు సిహెచ్ పుల్లారావు, నభీన, అనుష, జమున, విజయ, సత్యవతి, శివకుమారి విద్యార్థుల తల్లిదండ్రులు వేల్పుల నరసింహరావు, కొర్ర రమేష్, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.