మన్యం న్యూస్, దమ్మపేట, మే, 31: మండల పరిధిలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవ వేడుకలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆలయానికి విచ్చేసిన తుమ్మలకు ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో రాచమళ్ళ నవీన్, జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు