మన్యం న్యూస్ ,పినపాక:
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ రవి శేఖర్ వర్మ తెలియజేశారు. బుధవారం పినపాక సహకార సంఘం లో చైర్మన్ రవి శేఖర్ వర్మ అధ్యక్షతన పాలకవర్గ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాటు పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగాా జూన్ 2 న కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేయాలని, జూన్ 3 న రైతుల దినోత్సవం సందర్బంగా ఉమ్మడి మండలం లోని రైతు వేదికలు పినపాక, ఈ.బయ్యారం, జానంపేట , కరకగూడెం, అనంతారం రైతు వేదికలలో రైతులతో రైతుల మధ్యన ఘనంగా రైతుదినోత్సవాన్ని జరుపుకోవాలని తెలిపారు. ఈ వేడుకల్లో ఉమ్మడి పినపాక మండల రైతులు తమ పరిధిలో ఉన్న రైతు వేదికలలో అధిక సంఖ్యలో పాల్గొనేలా చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.. ఈ సమావేశంలో డైరెక్టర్లు రావుల కనకయ్య, గుణిగంటి సమ్మయ్య, ముద్దం సతీశ్, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు లక్శ్మణ్ రావు, రమెశ్, కేశవరావు, అనిల్, ప్రశాంత్, సంఘం సీఈవో సునీల్, సిబ్బంది పాల్గొన్నారు.