- యువత ప్రేమకు “ఫిదా”
- రేగాకు పెన్సిల్ చిత్రపటం అందజేసిన తోగ్గూడెం యువత
- ఫిదా ఐనా రేగా కాంతారావు
- రేగా లాంటి నాయకుడు ఉండడం పినపాక నియోజకవర్గ ప్రజల అదృష్టం
- బీ. ఆర్.ఎస్ పినపాక నియోజకవర్గ యువజన విభాగం నాయకులు బండ మనోజ్ రెడ్డి
మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలం తోగ్గూడెం గ్రామ, పినపాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ,యువ నాయకుడు బండమనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుని మణుగూరులో మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే రేగా చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బండ మనోజ్ రెడ్డిని, ఎంతో అద్భుతంగా రేగా చిత్రాన్ని గీసిన పాలకూరి సాయిరాం గౌడ్ ని ఎమ్మెల్యే రేగా కాంతారావు అభినందించారు.ఈ కార్యక్రమంలో చీమల నవీన్, చీమల సాయి,కొమరం రమేష్, ఊకే సుబ్బు, కొమరం సంతు, సృజన్, పాయం బాలు,పాయం కృష్ణ, బాబు తదితరులు పాల్గొన్నారు.