UPDATES  

 ఏజెన్సీలో గిరిజన చట్టాలను పక్కదోవ పట్టిస్తున్న అధికారులు.. ఆదివాసి సేన జిల్లా కన్వీనర్ రమేష్

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం మే 31::
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను కాపాడవలసిన అధికారులు గిరిజనేతర వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నారని ఏజెన్సీ చట్టాలను కాపాడలేని అధికారులు ఎందుకని ఆదివాసి సేన జిల్లా కో కన్వీనర్ కారం రమేష్ మండిపడ్డారు. దుమ్ముగూడెం మండలంలోని రామారావు పేట గ్రామంలో ఆదివాసి సేన ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో కేవలం ఇసుక ర్యాంపులు మద్యం షాపుల విషయంలో మాత్రమే ప్రభుత్వాధికారులు పెస గ్రామసభలు నిర్వహించడం జరుగుతుంది తప్ప మిగతా ఆదివాసీల అభివృద్ధి కొరకు ఉండే చట్టాల విషయంలో ప్రభుత్వ అధికారులు ఎటువంటి చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని ఇలాంటి వివరాలు పై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన వారు కూడా నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తూ వారిపై చర్యలు కూడా తీసుకోవడం లేదని ఆవేదన చెందారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు దక్కవలసిన వనరులను బినామీలుగా పెట్టి గిరిజనేత్రులు లాభ పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులు గిరిజనేత్రుల అండగా ఉంటున్నారని ఆదివాసులు అభివృద్ధి చెందకుండా వారి మధ్య చిచ్చుపెట్టి వివాదాలు సృష్టిస్తున్నారని ఆదివాసి మిత్రులు యువత గమనించి వారికి బుద్ధి చెప్పాలని తెలిపారు మన చట్టాలను మనం కాపాడుకొని వాటి అమలుకై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదివాసి సేన కార్యకర్తలు జోగారావు వెంకట్ రవి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !