- మంచి మనసున్నోడు మనోహర్ బాబు
- భౌతికంగా దూరమైన ఆయన జ్ఞాపకాలు ఎన్నటికీ పదిలం
- బీఆర్ఎస్ నాయకులు సోమరాజు మనోహర్ అకాల
- మరణం.. ఎంతో బాధాకరం
- శోక సంద్రమైన రేగళ్ల గ్రామం.. పలువురు నేతలు ఘన నివాళులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఎన్నో ఏళ్ల తరబడి ఏజెన్సీ గ్రామాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని గిరిజనలకు గిరిజన నేతలకు ఆదర్శప్రాయుడుగా నిలిచి వారి సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమరాజు మనోహర్ అకాల మృతి ఎంతో బాధాకరమని పలువురు పార్టీ నేతలు అభివర్ణించారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలోని సోమరాజు మనోహర్ స్వగ్రామం మైన రేగళ్ల గ్రామంలో సోమరాజు మనోహర్ అంత్యక్రియలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ పార్టీలకు చెందిన నేతలు అనేక ప్రాంతాల నుంచి ఏజెన్సీ లోని గిరిజనులు గిరిజనేతరులు వేలాదిమందిగా తరలివచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సోమరాజు మనోహర్ అకాల మరణం జీన్నించుకోలేని ఏజెన్సీ గ్రామ ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు రేగళ్ల గ్రామం శోకసంద్రమైంది. గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో మనోహర్ రాజకీయ జీవితం ఎంతో అంచలంచెలుగా ఎదగడమే కాకుండా అనేక పార్టీలలో కీలక పాత్ర పోషించి నేతల గెలుపోవటములకు ప్రధాన కారకుడుగా నిలవడం లో ఆయన ముఖ్యుడు. గ్రామంలోని అనేక భూములను నిరుపేద గిరిజనులకు దారా దత్తం చేసిన ఘనత ఆయనకే దక్కింది. మనోహర్ అంత్యక్రియలో పాల్గొన్న కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు పోట్ల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జిల్లా కార్యదర్శి ఎస్కె అన్వర్ పాషా, పాల్గొని ఘన నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సోమరాజు మనోహర్ పార్టీలకు అతీతంగా ఎన్నో సేవలు చేశారని ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఆయన ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా అందరికీ ఆదర్శప్రాయుడుగా నిలుస్తూ ఒక మంచి వ్యక్తిగా ఎదిగాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కొత్తగూడెం మండల వైస్ ఎంపీపీగా కూడా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన అన్ని వర్గాల ప్రజలకు అనేకమైన సేవలను అందించారన్నారు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరంగా నిలిచిపోతాయి అన్నారు. అనంతరం సోమరాజు మనోహర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.