UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహణలో భాగంగా జూన్ 3వ తేదీ శనివారం తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని లక్ష్మి దేవిపల్లి మండలం, లోతువాగు గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాట్లును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 67 వ్యవసాయ క్లస్టర్లలోని రైతు వేదికల్లో తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఏర్పాట్లు ప్రక్రియను వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులతో సమావేశం జాతీయగీతాలపనతో ప్రారంభం కావాలని కోరారు. రైతు వేదికలను మామిడి తోరణాలు, పువ్వులు, సీరియల్ బల్బులతో అద్భుతంగా అలంకరించాలని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే విధంగా ఫ్లెక్సీలు ఉండాలన్నారు. సభలో రైతుబంధు సమితుల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సహకార సంఘాల చైర్మన్లు, వ్యవసాయ, ఉద్యాన మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు, నాయకులు అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు దినోత్సవానికి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో కోలాహలంగా పండుగ వాతావరణం ఉట్టిపడే విదంగా ఉండాలని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తదుపరి వ్యవసాయరంగంలో జరిగిన సంపూర్ణ ప్రగతిని, వివిధ పథకాలలో (ఉచిత విద్యుత్తు, రైతుబంధు మొదలైనవి) ఒక్కో రైతుకు కలిగిన లబ్దిని, ఆ క్లస్టర్ లోని గ్రామాలకు వ్యవసాయశాఖ ద్వారా వచ్చిన నిధులు గురించి వివరించాలని, కరపత్రాలు సభలో చదవాలని తెలిపారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన కరపత్రం, బుక్ లెట్, పోస్టర్ల వంటి సమాచార సామగ్రి ప్రతి రైతుకు పంపిణీ చేయాలని చెప్పారు. రైతు బీమా లబ్దిదారులతో వారి కుటుంబానికి కలిగిన మేలును గురించి సభలో మాట్లాడించాలన్నారు. కార్యక్రమం అనంతరం
రైతులందరికి. సామూహిక భోజనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు, జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !