మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 31
మణుగూరు మండలం లోని శ్రీశ్రీ నగర్ ఏరియా కు చెందిన లారీ అసోసియేషన్ యూనియన్ సెక్రటరీ సరెడ్డి రాఘవరెడ్డి,రమాదేవి దంపతుల కుమార్తె సింధుజ రెడ్డి ప్రధానం వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాబోయే నూతన వధువును విప్ రేగా కాంతరావు అక్షింతలు వేసిఆశీర్వదించారు.అనంతరం మండలం లోని రైల్వే స్టేషన్ ఏరియా కు చెందిన పద్ధం ప్రవళిక ప్రధానం వేడుకకు విప్ రేగా హాజరై కాబోయే వధువును అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో జడ్పిటిసి పోశం, నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శిలు రామిరెడ్డి,నవీన్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు వట్టం. రాంబాబు,యాదగిరి గౌడ్,రవి ప్రసాద్,హర్ష నాయుడు,నవీన్ బాబు,పధ్ధం.శ్రీనివాస్,సృజన్, రమేష్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.