- పోతురాజు రవి ఆధ్వర్యంలో దద్దరిల్లిన దశాబ్ది ఉత్సవాలు
- ఫలించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్
- తొమ్మిదేళ్ల తెలంగాణ పాలన అభివృద్ధిపై
వినూత్నప్రదర్శన
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాలు మేరకు
గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లు అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ టౌన్ యూత్ అధ్యక్షులు పోతురాజు రవి సారధ్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకలు అంబరాన్ని అంటాయి. ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా వివరించడమే కాకుండా ఎందరిలో చైతన్యపరిచింది పవర్ పాయింట్ స్క్రీన్ పై ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోపక్క పినపాక శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఫోటోలతో బిట్లు వినూత్నంగా ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. నేటి నుంచి 20 రోజులపాటు అంగరంగ వైభవంగా దశాబ్ది ఉత్సవాలను కన్నుల పండుగగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు పినపాక శాసనసభ్యులు రేగ ఆలోచనలతో పోతురాజు రవి సేకరించిన పలు వీడియో చిత్రాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెగించి పోరాడిన చారిత్మాత్మకమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఘట్టాలను పూర్తిస్థాయిలో సేకరించి పవర్ ప్రజెంటేషన్ ద్వారా బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేయడంతో దశాబ్ది ఉత్సవాల్లో పోతురాజు రవి చేపట్టిన ఈ వినూత్న ప్రయోగాన్ని చూసి ప్రతి ఒక్కరూ అభినందించారు.