మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాళ్లవాగు తీరాన నిర్మించిన గుబ్బల మంగమ్మ గుడి ఆవరణలో గుబ్బల మంగమ్మ విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట, యాగ హోమ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల ఎంపీపీ దంపతులు రేగా.కాళికా సత్యనారాయణ దంపతులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందమైన అటవీ ప్రాంతంలో గుడి నిర్మించి ధ్వజస్తంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గుబ్బల మంగమ్మ దయవల్ల మండల ప్రజలు సుఖ సంతోషాలతో శిరసంపదలతో ఉండాలని ఆమె కోరుకున్నారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మండల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై దేవికి మొక్కులు ముడుపులు అందజేశారు ఆలయ కమిటీ అందించిన తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బట్టుపల్లి సర్పంచ్ దంపతులు నాగేశ్వరరావు,రమాదేవి,చిట్టి వెంకటేశ్వర్లు ఆలయ ధర్మకర్త పూజారులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.