మన్యం న్యూస్ మణుగూరు టౌన్: జూన్ 1
మణుగూరు జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంధర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ మాట్లాడుతూ,మే నెల లో మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 10 లక్షల 18 వేల 500 టన్నులకు గాను రికార్డు స్థాయి లో 12 లక్షల 40 వేల 452 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగింది అన్నారు. మే నెలలో సాధించిన బొగ్గు ఉత్పత్తి 122 శాతం గా నమెదు అయిందని తెలిపారు.అలాగే 01 ఏప్రిల్ 2023 నుండి 31 మే 2023 వరకు ప్రోగ్రెస్సివ్ బొగ్గు ఉత్పత్తి 19.86 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 24.48 లక్షల టన్నుల సాధించడం జరిగింది అని,123 శాతం ఉత్పత్తి సాధించడం జరిగింది అని తెలిపారు. బోగ్గు రవాణా లో మే నెల లో మణుగూరు ఏరియా 12 లక్షల 56 వేల 141 టన్నులను బొగ్గు రవాణా చేయటం జరిగింది అన్నారు. అలాగే 01 ఏప్రిల్,2023 నుండి 31 మే,2023 వరకు ప్రోగ్రెస్సివ్ గా 24.26 లక్షల టన్నులు రవాణా చేయడం జరిగింది అన్నారు.మే నెలలో ఓవర్ బర్డెన్ మన డిపార్ట్మెంటల్ గా 15 లక్షల క్యూబిక్ మీటర్లకు లక్ష్యానికి గాను 92 % తో
13 లక్షల 76 వేల క్యూబిక్ మీటర్లు తీయటం జరిగింది అని అన్నారు.అలాగే 01 ఏప్రిల్,2023 నుండి 31 మే 2023 వరకు 27.61 లక్షల క్యూబిక్ మీటర్ల తీయడం జరిగింది అని ఇది 92 % శాతం గా నమోదు అయింది అని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎస్ ఓ టు జిఎం లలిత్ కుమార్,డీజీఎం పర్సనల్ రమేష్ సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు