UPDATES  

 నూతన సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ ఏనిక ప్రసాద్

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: జూన్ 1

మణుగూరు మండలం లోని కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని పీవీ కాలనీ అయ్యప్ప టెంపుల్,శివాలయం కు వెళ్లే భక్తులకు ప్రతి సంవత్సరం వర్షాకాలం ఇబ్బందికరంగా ఉంటుందని భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించగా,భక్తుల సౌకర్యార్థం స్థానిక సర్పంచ్ ఏనిక.ప్రసాద్ కు వినతి పత్రం అందజేసి సమస్యను తెలిపారు.సమస్యపై వెంటనే స్పందించిన సర్పంచ్ ఏనిక. ప్రసాద్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ నిధుల నుండి పీవీ కాలనీ అయ్యప్ప టెంపుల్ కు 3 లక్షల రూపాయలు,శివాలయం కు 2 లక్షల రూపాయలతో రెండు సీసీ రోడ్లు మంజూరు చేశారు. ఈ మేరకు గురువారం సర్పంచ్ ఏనిక ప్రసాద్,మణుగూరు టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర్ రావు చేతుల మీదుగా నూతన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పివీ కాలనీ ఎంపీటీసీ సభ్యులు గుడిపూడి కోటేశ్వరరావు,మచ్చ సమ్మక్క, వార్డు సభ్యులు మిట్టపల్లి కిరణ్ కుమార్,పోదెం రమాదేవి,షాకీర్ బేగం,చీమల రాంబాబు, మణుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు నవీన్ బాబు,మడి వీరన్న బాబు,కూనవరం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిన్నాక వెంకట్రావు, జట్పట్ వెంకన్న,మూసా,వంక అర్జున్ రావు,పీవీ కాలనీ శివాలయం,అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులు ఎన్ వి ఎస్ ప్రసాద్,విశ్వనాథం, రాజు,కోర్ర భరత్ స్వామి తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !