- తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో..
- సింగరేణి అభివృద్ధిని సగర్వంగా చాటుకుందాం
- సింగరేణి వెలుగులు జిలుగులు పంచుకుందాం
- విలేకరుల సమావేశంలో సింగరేణి డైరెక్టర(పా )బలరాం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఈనెల రెండవ తేదీ నుంచి 22వ తేదీ వరకు పండుగ వాతావరణంలో జరుగుతున్న శుభ సందర్భంలో సింగరేణి సాధించిన అభివృద్ధిని సగర్వంగా చాటుకొని సింగరేణి వెలుగులు జరుగును పంచుకుందామని సింగరేణి డైరెక్టర్ (పా)బలరాం పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాలను సింగరేణి వ్యాప్తంగా ఎంతో కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల రెండవ తేదీ నుంచి 5వ తేదీ వరకు కొత్తగూడెం లోని సింగరేణి ప్రకాశం స్టేడియంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సింగరేణి చేసిన అభివృద్ధి తదితర అంశాలపై ఉత్సవాల వేడుకల్లో తెలియజేస్తామన్నారు. తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుతూ సిరులు గల సింగరేణి చరిత్రను దశాబ్ది ఉత్సవాల్లో ప్రత్యేకంగా తెలియజేసేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేపట్టామన్నారు. ప్రత్యేక వీడియోను ఆవిర్భవింప చేసి ప్రజలకు తెలియజేసేందుకు తాము కృషి చేస్తున్నట్టు తెలిపారు. సింగరేణి గని ప్రాంతాల్లో జాతీయ పతాకవిష్కరణలతో పాటు సింగరేణి రన్ ప్రత్యేకంగా చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు అర్పించనున్నామన్నారు. రెట్టింపు ఉత్సాహంతో సత్తుపల్లి మణుగూరు భూపాల్ పల్లి ఇల్లందు రామగుండం ఏరియా సింగరేణి, బెల్లంపల్లి, గొల్లెట్టు తదితర ప్రాంతాల్లో కూడా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సింగరేణి సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎన్నో సరికొత్త కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని తెలియజేస్తున్నామన్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి రవాణా లాభాలు టర్నోవర్లు అత్యుత్పత వృద్ధిని సాధించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు 2013, 2014 సంవత్సరంలో 504 లక్షల టన్నుల ఉన్న బొగ్గు ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2022, 23..లో 33% వృద్ధితో 670 లక్షల టన్నులు ఉత్పత్తిని చేరిందన్నారు. అంతేకాకుండా 39% వృద్ధితో 667 లక్షల బొగ్గు రవాణాలను చేపట్టిందన్నారు. గతంలో 2013 14 సంవత్సరములు 168.78 మిలియన్ల క్యూబిక్ మీటర్లు మట్టిని తీసిన కంపెనీ తెలంగాణ వచ్చిన తర్వాత 2022 ,23 సంవత్సరంలో 142% వృద్ధితో 410 మిలియన్ క్యూబిక్ మీటర్లు మట్టిని తీసింది అన్నారు. గతంలో 11928 కోట్ల రూపాయల టర్న్ ఎవరు ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 176% వృద్ధితో 2022 23 సంవత్సరంలో 32,978 కోట్ల రూపాయల టర్న్వర్ సింగరేణి సంస్థ సాధించిందని తెలిపారు. గతంలో నికర లాభాలు 419 కోట్ల రూపాయలు మాత్రమే ఉండగా రాష్ట్ర ఏర్పడిన తర్వాత 421 శాతం మృతితో 2,184 కోట్ల రూపాయల నికర లాభాలను కంపెనీ ఆర్జించిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందని దీనిలో భాగంగా ఇప్పటివరకు 254 మెగావాట్ల సోలార్ విద్యుత్తును గ్రిడ్డుకు అనుసంధానం చేయడం జరిగిందన్నారు ఏప్రిల్ 2023 వరకు 630 మిలియన్ యూనిట్ల సోలార్ విద్యుత్ సరఫరా చేయటం జరిగిందని మిగిలిన 76 మెగావాట్లు 2023 జూలై నాటికి పూర్తి కానున్నాయియన్నరు. 2014 కి పురం ఆరేళ్లలో సాధించిన ఘనలు కన్నా ఎక్కువగా రాష్ట్ర అవతరణ తర్వాత గడిచిన 8 ఏళ్లలో మొత్తం 14 కొత్త గనులు సాధించుకున్నామని రానున్న నాలుగేళ్లలో మరో ఎనిమిది కొత్తగనులు సాధించడానికి ప్రణాళికలు సమర్పించడం జరిగిందన్నారు. తెలంగాణ సాధనకు ముందు పది సంవత్సరాలలో 6453 ఉద్యోగాలు ఇవ్వగా రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు సింగరేణి సంస్థలు మొత్తం 19467 మందికి కొత్తగా ఉద్యోగాలు వీటిలో 2014 నుంచి 2023 ఏప్రిల్ నాటికి డిపెండెంట్ కారుణ్య నియమాక ప్రక్రియ కింద 15, 256మంది నిరుద్యోగ వారసులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లాభాల బోనస్ను భారీగా పెంచి పంపిణీ చేయడం జరిగిందన్నారు. 2014 సంవత్సరంలో 18 శాతం ఉండగా వరుసగా పెంచుతూ 2022 సంవత్సరాల కాలం నాటికి 30% వరకు లాభాల బోనస్ పంపిణీ చేయడం జరిగిందన్నారు అనేక సంక్షేమ ఫలాలను సింగరేణి కార్మికులకు సింగరేణి సంస్థ ద్వారా అందిస్తూ తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి సంస్థ తలమానికంగా నిలిచిందన్నారు. ఈ సమావేశంలో సింగరేణి అధికారులు శ్రీనివాసరావు బసవయ్య ,వెంకటేశ్వర్లు, ఉమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.