మన్యం న్యూస్ చండ్రుగొండ, జూన్ 01:
పేదలందరికి ఇండ్లు మంజూరి చేయాలని రిపబ్లిక్ పార్టీ ఆప్ ఇండియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేల్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం రిపబ్లిక్ పార్టీ ఆప్ ఇండియా ఆద్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయంలో వరకు భారీ ర్యాలి నిర్వహించి, డిప్యూటీ తహసీల్దార్ ఎల్ ప్రసన్నకు వినతిని సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2005 ముందు పోడు సాగు చేస్తున్న అన్ని కులాల పొడు సాగు రైతులకు రైతుబంధు అమలు చేయాలని,ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని,పనిచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కుంజా నాగేంద్రబాబు, పద్దం వెంకటేశ్వరరావు, శేషు కుమార్ , తదితరులు పాల్గొన్నారు.