మన్యం న్యూస్ చండ్రుగొండ, జూన్ 01: దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించాలని మండల ప్రత్యేకాధికారి సంజీవరావు పిలుపునిచ్చారు. గురువారం మండల పరిషత్ కార్యలయంలో జరిగిన ప్రజా ప్రతినిధులు , అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శుక్రవారం నుండి ప్రారంభమయ్యే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఈ నెల 22 వరకు జరుగుతాయన్నారు. గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేలా చూడాలన్నారు. ఈ నెల 3న రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, రైతువేదికల వారిగా క్లస్టర్ల వారిగా 1000 నుండి 1200 వరకు రైతులతో భారీ ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. ప్రతి పంచాయతీ నుండి రాజకీయాలకు అతీతంగా రైతులు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రేవతి, తహసీల్దార్ వర్సా రవికుమార్, ఎంపిఓ తోట తులసీరాం, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గాదె లింగయ్య, గుంపెన సోసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధారా బాబు, నాయకులు మేడా మోహన్ రావు , సర్పంచులు భూక్యా రణ్య ,పూసం వెంకటేశ్వర్లు, బాబురావు, అధికారులు,ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.