- అయ్యో భగవంతుడా…. ఇన్ని అవస్థలా. .
- కాలికి ఇన్ఫెక్షన్ సోకి నానా ఇబ్బందులు.
- దిన దిన గండంగా బతుకుతున్న భగవంతుడు
- దాతలు ఆదుకోవాలని వేడుకోలు
మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని పినపాక గ్రామానికి చెందిన చామకూరి భగవంతుడు అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల క్రితం కాలికి గాయం అయ్యి, ఆ వెంటనే ఇన్ఫెక్షన్ సోకి నడవడానికి నానా ఇబ్బందులు పడుతూ జీవితాన్ని గడుపుతున్నాడు. అసలే రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. పైగా కాలికి గాయం అయ్యి రోజువారి పనికి దూరం కావడంతో కుటుంబం మొత్తం తిండి కోసం నానా అవస్థలు పడుతుంది. భగవంతుడు భార్య రమణ రోజు కూలి పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో మందులు కొంటున్నప్పటికీ ఫలితం లేక, దాదాపు కాలు తీసివేసే పరిస్థితికి వచ్చింది. మా పరిస్థితిని గమనించిన దాతలు దయతో ఆదుకోవాలని, భగవంతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.