మన్యం న్యూస్ మణుగూరు టౌన్: జూన్ 1
మణుగూరు టిఎస్ ఆర్టిసి ఆధ్వర్యంలో వికలాంగులకు 50 శాతం రాయితీతో బస్ పాసులను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 50 శాతం రాయితీ మినహా మిగిలిన 50 శాతం డబ్బులు చెల్లించి పాస్ తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. స్పందించిన బిఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్.రాజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మణుగూరు లోనీ వికలాంగులు అందరికీ 50 శాతం డబ్బు చెల్లించి బస్సు పాస్ లు ఇప్పిస్తామని ఎన్ ఎన్.రాజు తెలిపారు.ఈ మేరకు గురువారం నాడు ఆర్టీసీ డిపో మేనేజర్ టి స్వామీ,బిఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు చేతుల మీదుగా చేతుల మీదగా సుమారు 50 మందికి 50 శాతం డబ్బు చెల్లించి పాసులు పంపిణీ చేయడం జరిగింది.సీఎం కేసీఆర్ స్ఫూర్తి తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎన్ ఎన్ రాజు తెలిపారు.మణుగూరు ప్రాంతం లోని వికలాంగులు అందరికీ కూడా బిఅర్ఎస్వీ అధ్వర్యంలో 50 శాతం డబ్బు చెల్లించి పాస్ లు ఇప్పిస్తామన్నారు.ఈ అవకాశాన్ని వికలాంగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షులు పవన్ నాయక్, బిఆర్ఎస్వీ నాయకులు, అజయ్,క్రాంతి కుమార్, బొలిశెట్టి నితిన్,ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.