- పలు కార్యక్రమాల్లో పాల్గొన్నఎమ్మెల్యే మెచ్చా
- రూ.1.10 కోట్లతో ప్రాజెక్టు మరమ్మత్తులకు మంజూరు చేయించిన మెచ్చా ఆ పనులు పరిశీలన
మన్యం న్యూస్, అశ్వారావుపేట, జూన్, 01: అశ్వరావుపేట మండల పరిధిలోని గురువారం పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మెచ్చా పాల్గొన్నారు. మండల పరిదిలోని గుమ్మడివల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో అన్నపూర్ణాదేవిసమేత కాశివిశ్వేస్వరస్వామి దేవాలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అయినాల సత్యనారాయణ చార్యులు (మునకుళ్ళ) వారి ఆధ్వర్యంలో బయ్యన్నగూడెం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ విశ్వనాధుని రామాచార్యులు పర్యవేక్షణలో గ్రామస్థుల నడుమ అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ శీతలాంబాదేవి (బొడ్రాయి), శ్రీ గంగానమ్మ తల్లి , పోతురాజులు, మరియు జీవధ్వజ స్తంభము ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ భగవంతుని దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో అనేక అభివృద్ది పనులు చేపడుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతు పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యే మెచ్చా అంటూ గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మెచ్చా అక్కడ ఉన్న అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఒక వార్డ్ లో మంచి నీరు రావట్లేదు అని తెలుపడంతో సంబంధిత అధికారితో మాట్లాడి మంచి నీరు అందే విధంగ చేస్తానని తెలిపారు. అలాగే ఆలయం వద్ద ఏఎన్ఎం లను అప్రమత్తంగా ఉండాలని ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని జాగ్రత్తగా చూసుకోవాలని పలు సూచనలు చేశారు. అనంతరం గుమ్మడివల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్ వద్ద గేట్లు పూర్తిగా చెడిపోవడం నీరు ఆగటం లేదని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 1కోటి 10లక్షలు నిధులు మంజూరు చేయించారు, గురువారం ఆలయం వద్దకు వెళ్లిన సందర్భంలో ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఫోన్ లో మాట్లాడుతూ ఆదేశించారు. అదే విదంగా వినాయకపురం కాలని వద్ద దిడ్డి వీరబాబు, నాగ జయలక్ష్మి దంపతుల కుమారుడు దినేష్ వర్మ వివాహ వేడుకలో పాల్గొనీ ఆశీర్వదించారు. అదే విదంగా అనంతారం రైతు వేదిక వద్ద ఇటీవలే జరిగిన క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు ప్రైజ్ మనీ ట్రోఫీలను ఎమ్మెల్యే మెచ్చా అందజేశారు. అనంతరం అక్కడే డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉంటున్న ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు, సీసీ రోడ్లు కావాలని కోరడంతో తప్పకుండా ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.