UPDATES  

 పౌరహక్కుల దినోత్సవం నాడు ఊసేలేని తహసీల్దార్లు

  • పౌరహక్కుల దినోత్సవం నాడు ఊసేలేని తహసీల్దార్లు
  • జిల్లా కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని వైనం
    రాజమళ్ళ సుకుమార్
    మన్యం న్యూస్ మంగపేట.
    ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎదుర్కొనే సామాజిక ఆర్థిక మరియు సాంస్కృతిక వివక్షల గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి జీవో ఎంఎస్ నెంబర్ 105, తేదీ 31 అక్టోబర్ 2021 జీవో ఎంఎస్ నెంబర్ 128 తేదీ 21 నవంబర్ 2001 ల ద్వారా పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమం రూపొందించబడింది ప్రతి నెల 30వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలాలలో ఏదో ఒక గ్రామంలో సంబంధిత మండల స్థాయి అధికారులు మరియు ప్రజాప్రతినిదు ల భాగస్వామ్యంతో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించలని ఆదేశాలు జారీచేసిన ములుగు జిల్లాలో పౌర హక్కుల దినోత్సవం తూతూ మంత్రంగా నిర్వహిస్తున్న అధికారులు మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు,నూగువెంకటాపురం, తాడువాయి,గోవిందరావుపేట, వెంకటాపురం, ములుగు ఈ మండలాల్లో గత మూడు నెలలుగా ఊసే లేని సివిల్ డే సాక్షాత్తు ఈ జిల్లా కలెక్టర్ మే నెల23, తేది 2022 జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వయంగా పౌర హక్కుల దినోత్సవం తప్పకుండా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తూ అట్టి కార్యక్రమంలో అట్రాసిటీ సభ్యులు కూడా భాగస్వాములు చేయాలని చెప్పిన విషయం కూడా మర్చిపోయి కనీసం పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించకపోవడం అత్యంత బాధాకరం ఈ జిల్లా వెనుకబడిన జిల్లాగా ఎస్సీ ఎస్టీ జిల్లాగా కాగితాలలో చూపించే అధికారులు కనీసం ఆ వర్గాలపై జరుగుతున్న దాడులు అన్యాయాలు వీటిపై కనీస అవగాహన కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలను కూడా పాటించకపోవడం అత్యంత విడ్డూరం ఇప్పటికైనా గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఒక సర్కులర్ జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అని రాజమళ్ళ సకుమార్ ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !