UPDATES  

 ఆదివాసీ బిడ్డలకు సామూహిక సీమంతాలు.

మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం ప్రాదమిక ఆరోగ్య కేంద్రం పరిదిలోని రాళ్లాపురం గ్రామంలో 12 మంది ఆదివాసీ గర్బిణి మహిళకు చర్లకు చెందిన జవ్వాది కుటుంబం ఆద్వర్యంలో, చర్ల పి హెచ్ సి సహకారంతో గురువారం సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో గర్బిణి మహిళలకు సాంప్రదాయబద్దంగా పసుపు, కుంకుమ పెట్డి చీర, గాజులు బహూకరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ దివ్యనయన మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని చేపట్డిన జవ్వాది మురళీకృష్ణ, వెంకటనర్సమ్మ దంపతులను అబినందించారు. ఇటీవల ఆకుటుంభం చేస్తున్న సేవాకార్యక్రమాలను మీడియా ద్వారా తెలుసుకున్నానని ఇటువంటి సేవలు తనలో ఎంతో స్పూర్తి నింపాయన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు జవ్వాది మురళీకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా పేదలకు సేవచేయడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. గడచిన మూడేల్లుగా తమ కుటుంబం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. జూన్ చివరివారంలో చత్తీస్‌గఢ్ సరిహద్దులోని ఎర్రంపాడు గ్రామ గిరిజన మహిళలకు తమ కుటుంబం ద్వారా సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమం లో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మౌనిక, డాక్టర్ శిరీష, సిడిపివో చైతన్య, డి పి ఎం వో లు చింతా సత్యనారాయణ, ఆడెపు ముత్యాలరావు, హెచ్ ఈ వో వేణుగోపాలకృష్ణ, విశ్రాంత ఉపాద్యాయులు దొడ్డి తాతారావు, సూపర్ వైజర్లు వెంకటనర్సమ్మ, పుష్పావతి, రాంప్రసాద్, ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ స్వరూప, పెద్దాడ ఆశాలత, పటేల్ వెంకటేశ్వర్లు, లంకా వెంకట్, జవ్వాది శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !