- కలివేరు గ్రామానికి కార్డులతో సంబంధం లేకుండానే బాత్రూంలు నిర్మించాలని న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఏపీఓకి వినతి పత్రం
మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం కలివేరు గ్రామంలో జాబు కార్డు లేకుండానే పేదలందరికీ బాత్రూంలు నిర్మించి ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సభ్యుని కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఏపీఓ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది.అనంతరం కార్యదర్శి ముసలి సతీష్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న పేతురు సమస్యలను పరిష్కరించే దిశలో ఈ ప్రభుత్వాలు లేవని వారన్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలి ప్రకృతిని కాపాడుకోవాలి పర్యావరణాన్ని పెంచుకోవాలని చెబుతూనే బాత్రూంలోని కట్టించే కాడ కూడా ఆధార్ కార్డులు జాబ్ కార్డులు రేషన్ కార్డులు ఉండాలని నిబంధనలతోటి వారిని ప్రభుత్వ పథకాలకు దూరం చేస్తున్నారని వారన్నారు. కావున అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి తక్షణమే ఏ ఆధారం లేకుండానే ప్రజలకు బాత్రూంలో ప్రభుత్వ పథకాలు అందజేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సభ్యులు కమిటీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో బొర్ర సమ్మక్క,కుర్సం సమ్మక్క, కూరం సమ్మక్క, కల్లూరి భవాని, రుక్మిణి, రమణ తదితరులు పాల్గొన్నారు.