- ప్రభుత్వవిప్ రేగా అభివృద్ధి మంత్రం
- రూ.10 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు
- మన్యం న్యూస్ మణుగూరు టౌన్:జూన్ 2
మణుగూరు మండలం లోని ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయతీలో 10 లక్షల రూపాయలు ఎస్ డిఎఫ్ నిధులతో పలు అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు,స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ నేతలతో, కలిసి శంకుస్థాపనలు చేశారు. ముత్యాలమ్మ నగర్ గ్రామంలో గుంటక జయరాం,ఇంటి నుండి ఎస్ సిసిఎల్ స్కూల్ వరకు 5 లక్షల రూపాయలు అంచనా వ్యయం తో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు విప్ రేగా శంకుస్థాపన చేశారు. అనంతరం ఎస్ సిసిఎల్ స్కూల్ నుండి అక్కినపల్లి రాజేష్ ఇంటి వరకు సుమారు 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, అభివృద్ధి,సంక్షేమం లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన కు అవసరమైన నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ది తో పనిచేస్తుందన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వం లో సంక్షేమ పథకాల అమలులో దేశం లోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్డు లు, బిటి రోడ్ల నిర్మాణానికి,పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం తోపాటు నిర్దేశించిన గడువు లోపు పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి జరుగుతుంది అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం.నరసింహారావు మండల ప్రజా ప్రతినిధులు, ఎంపీటీసీలు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా,స్థానిక సర్పంచ్ కొమరం.జంపేశ్వరి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రవి,శంకర్,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.