మన్యం న్యూస్ కథనానికి స్పందన
భగవంతుని కుటుంబానికి ఆర్థిక సాయం
మన్యం న్యూస్,పినపాక: మండల పరిధిలోని పినపాక గ్రామానికి చెందిన చామకూరి భగవంతుడు అనే వ్యక్తి పడుతున్న బాధను మన్యం ప్రచురించింది. విషయం తెలుసుకున్న మణుగూరు మండల బీ.ఆర్.ఎస్ మహిళా విభాగం నాయకురాలు రమ సుధాకర్ ధారవత్ రూ.3వేల ఆర్ధిక సహాయం వెంటనే అందించారు. విషయం తెలిసిన వెంటనే స్పందించి సాయం అందించిన రమా సుధాకర్ ఔదార్యాన్ని పలువురు కొనియాడారు. ఆమెతో పాటు పత్రికా విలేకరి యాకన్న గౌడ్, కొత్త దామోదర్, రేగా కాంతారావు వీరాభిమాని వెంకటేశ్ లు తమ వంతు ఆర్థిక సాయం అందించారు. పత్రిక ద్వారా విషయం తెలుసుకున్న ఖమ్మం ప్రాంతానికి చెందిన కొందరు నేడు భగవంతుని కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించనున్నామని తెలియజేశారు.