మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి జూన్ 2:మండలం కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం జాతీయ జెండాని ఎగరవేశారు.ఈ సందర్భంగా తాటి మాట్లాడుతు తెలంగాణ ప్రజల పోరాటాన్ని,అమరుల త్యాగాలను అర్ధం చేసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియాగాంధీ అని అన్నారు.సోనియా గాంధీ ని గుర్తు చేసుకుంటూ మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి నాయకులు కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేశారు.అనంతరం కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో బానోత్ భీముడు,చెరుకురి రవి,చల్ల పుల్లయ్య,పెద్దారపు నాగరాజు,దోసపాటి రాంబాబు,అజీమ్,చల్లా రమేష్,ముద్రగడ వెంకటేశ్వరరావు,సుభాని,ఇనపనూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.