మన్యం న్యూస్ చండ్రుగొండ జూన్ 02 : పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని ప్రజాప్రతినిధులు, అధికారులు ముక్తకంఠంతో అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, సంబురాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… అమరవీరుల త్యాగఫలమే రాష్ట్ర ఏర్పాటన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల ప్రతినిధలు, యూనియన్ నాయకులు, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.