UPDATES  

 రాజీవ్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి*

మన్యం న్యూస్,ఇల్లందు:టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యల ఆదేశాల మేరకు ఇల్లందు పట్టణంలోని స్థానిక రాజీవ్ భవన్ నందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను శుక్రవారం ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అయిదు దశాబ్దాల తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన తెలంగాణ తల్లి సోనియాగాంధీ చిత్రపటానికి డాక్టర్ రవి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఐదు దశాబ్దాలుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించగా 1200 మంది త్యాగాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి అమరుడు కావద్దని ద్రవీకరించిన హృదయంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన మహనీయురాలు సోనియాగాంధీ అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందని నిఘా వర్గాలు హెచ్చరించినా కరీంనగర్ బహిరంగ సభలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటమేరకు తెలంగాణ అనే బిడ్డకు పురుడు పోయడం కోసం ఉభయ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అనే తల్లి ప్రాణార్పణ చేసి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియాగాంధీ అని వారు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రబిల్లును అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసి కేంద్రానికి బిల్లును పంపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకభూమిక పోషించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలంటే రానున్నకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మరియు విభజన హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నిజామాబాద్ పసుపు బోర్డు, ఎయిమ్స్ తదితర హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారంలోకి వచ్చేలా ప్రజలు ఆశీర్వదించాలని డాక్టర్ రవి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాణాల శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసిక తిరుమల్, మాజీ కౌన్సిలర్ ధారావత్ కృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ బిఎన్ గోపాల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ మహిళా కార్యదర్శి కమల, పట్టణ కాంగ్రెస్ కమిటీ బీసీ సెల్ అధ్యక్షులు ఆనంద్, ఇల్లందు నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరవింద్ స్వామి, సూరజ్, ఖాదర్ బాబు, పట్టణ మహిళా నాయకురాలు జ్యోతి, రవి, కాసిం, పాషా , మెహబూబ్ అలీ, వందన, సాయి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !