మన్యం న్యూస్ చండ్రుగొండ జూన్ 02 :మండల కేంద్రంలో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎందరో అమరవీరుల త్యాగ ఫలాలు ఫలితమే తెలంగాణ అని, తెలంగాణ వచ్చిన కూడా నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల అమరవీరుల ఆత్మలు గోషిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి, సర్పంచ్ వినోద్, ఎంపీటీసీ బొర్రా లలిత, కాంగ్రెస్ నాయకులు నల్లమోతు రమణ, గోవిందరెడ్డి, గుగులోత్ బాబు, కేశబోయిన నరసింహారావు, సంకా కృపాకర్,సంకా శంకర్,బొర్రా సురేష్, అంతటి రామకృష్ణ, రుక్మిణి, నాగమణి, మాధవి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.