మన్యం, న్యూస్, అన్నపురెడ్డిపల్లి జూన్2:తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అన్నపరెడ్డిపల్లి మండల పరిధిలోని బూరుగ్గూడెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పిలుపు మేరకు జాతీయ జెండా ఎగురవేసి అన్నీ వర్గాల అభివృద్దే ధ్యేయంగా,సంక్షేమం,సాగు లో దూసుకుపోతూ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికిక్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పటికీ వారికి అండగా నిలబడతాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వేముల హరీష్,నున్నా గోపాలరావు,షేక్ దస్తగిరి,సుభాని,బాలాజీ,తగిర్శ వెంకటేశ్వర్లు,నరేష్ గారు,నవీన్,అహ్మద్,అబ్దుల్ హుస్సేన్,పలువురు గ్రామస్థులు,ప్రజా ప్రతినిదులు తది తరులు పాల్గొన్నారు.