UPDATES  

 దేశానికే తెలంగాణ ఆదర్శం -తుమ్మల

  • దేశానికే తెలంగాణ ఆదర్శం -తుమ్మల
  • వైభవోపేతంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు
  • గ్రామ గ్రామాన పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు
  • వివిధ శాఖల ఆధ్వర్యంలో రోజుకో కార్యక్రమం
  • రాష్ట్రంలో సాధించిన ప్రగతిని చాటిచెప్పేలా కార్యాచరణ

మన్యం న్యూస్, దమ్మపేట, జూన్, 02: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు, దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అంకంపాలెం గ్రామంలో జాతీయ జెండాను మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్టీ జెండాను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులు ఆవిష్కరించారు. అనంతరం పట్వారీగూడెం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బిఆర్ఎస్ పార్టీ జెండాను మెచ్చా నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని, తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చాక మార్పు మనకి స్పష్టంగా కనిపిస్తుందినీ, వ్యవసాయం దండగ అన్న కాడనుంచి వ్యవసాయాన్ని పండగల ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని, కొన్ని పార్టీల నాయకులు కొంతమంది వచ్చి ఓట్లు వేయమని అడుగుతారని, ఎవరికి వెయ్యాలో ఎందుకు వెయ్యాలో అందరూ ఆలోచించాలని, అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుంది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే అని, రేపు మీ ఇళ్లకు వేరే పార్టీ వారు వచ్చి ఓటు అడిగితే ఎందుకు వెయ్యాలి అనే ప్రశ్న మీరు అడగాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే అభివృద్ది నీ మీరు వారికి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !