UPDATES  

 సంబరాలు సరే”మా భూముల ఆకాంక్ష ల మాటేమిటి. ఈ సంబరాలతో,తెలంగాణ ప్రజల ఆకాంక్షలు

  • సంబరాలు సరే”మా భూముల ఆకాంక్ష ల మాటేమిటి.
  • ఈ సంబరాలతో,తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా…?
  • సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యవర్గ సభ్యులు -నూపా భాస్కర్.

మన్యం న్యూస్.ములకలపల్లి జూన్ 2 :
మండలంలోని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో తెలంగాణ ప్రజల దీక్ష దివాస్ సభ నిర్వహించారు.అనంతరం బైక్ ర్యాలీ నిర్వహిస్తూ తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దమవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు,మా భూముల పట్టాల మాటేమిటి? మా నిరుద్యోగ భృతి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, నీళ్లు,నియామకాలు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం,ఆత్మగౌరవం మేరకు సాధించుకున్నామని సిపిఐ ఎంఎల్ ప్రజాపందా జిల్లా కార్యవర్గ సభ్యులు నూపా భాస్కర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్బంగా జిల్లా కార్యవర్గ సభ్యులు నూపా భాస్కర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కోటి ఆశలతో వేలాదిమంది బలిదానాలతో లాఠీ దెబ్బలు జైలులు అనుభవించి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేత్యాగాలు ఒకరివి భోగాలు మరొకరివా అని ప్రశ్నించారు.అంతేకాదు గత ప్రభుత్వాల హయాములో దశాబ్దాల కింద పేదలు సాగు చేస్తున్న భూములలో పట్టాలు ఇచ్చిన భూములలో తెలంగాణ ప్రభుత్వం,ఫారెస్ట్ శాఖ అక్రమ కందకాలు కొట్టి సాగుకు అడ్డుపడడం దుర్మార్గమైన పాలనకు పరాకాష్ట ని .డబుల్ బెడ్ రూమ్,నిరుద్యోగ భృతి,పెన్షన్,ఇండ్ల స్థలాలు మౌలికమైనవి ఇవేవీ అమలు చేయకుండా ఎవరికోసం ఈ సంబరాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా ఈ ప్రభత్వన్ని ప్రశ్నిస్తుందని అన్నారు. మండల కేంద్రంలో అధికారులు,రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద కాలం సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, స్థానికంగా ఉన్న ప్రజల కోరికలను న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంథా జిల్లా కమిటీ సభ్యులు కల్లూరి కిషోర్ పోతుగంటి లక్ష్మణ్ సిపిఎంఎల్ ప్రజాపంథా ములకలపల్లి మండల కార్యదర్శి కొర్సా రామకృష్ణ,తిమ్మంపేట ఎంపీటీసీ నూప సరోజిని రాచన్నగూడెం పంచాయతీ సర్పంచ్ కోర్స గణపతి,ఎస్ డి ఎల్ సి నాయకులు బండారి నాగేంద్రబాబు,నకిరికంటి నాగేశ్వరావు, ఎర్రగోర్ల రామారావు,వెలకం చలమన్న పుప్పాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !