UPDATES  

 నా తెలంగాణ కోటి రతనాల వీణ ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

  • నా తెలంగాణ కోటి రతనాల వీణ
  • ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
  • జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతరావు
  • ప్రజలకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
  • -తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:జూన్ 2

మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆవిర్భావ దినోత్సవాన్ని,పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు జాతీయ జెండా ను ఎగురవేశారు.అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంటర్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతరావు మాట్లాడుతూ, ప్రజలకూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనేక పోరాటాలు,త్యాగాలు బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో అభివృద్ధి లో అగ్రగామిగా నిలిచింది అన్నారు.అనతి కాలంలోనే దృఢమైన పునాదుల తో సుస్థిరతను సాధించి,దేశంలో లోనే నెంబర్ వన్ స్థాయికి చేరినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉన్నది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను, హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది అని వారు తెలిపారు.సీఎం కేసీఆర్ సహకారంతో జిల్లాలో సాగునీరు,తాగునీరు విద్యుత్, విద్య,వైద్యం,రోడ్లు తదితర మౌలిక వసతులకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆసరా పెన్షన్లలలో రాష్ట్రం ఆల్ టైం రికార్డు సృష్టించింది అన్నారు.పేద కుటుంబాలకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు.రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.నేటి నుంచి 22వ తారీకు వరకు 21 రోజులు దశాబ్ది ఉత్సవాల నిర్వహిస్తూ, ప్రభుత్వ విజయాలను ఇంటింటికి తీసుకువెళ్తామని అన్నారు.నియోజవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల లో దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబు చేసినట్లు వారు తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుంది అన్నారు.ప్రజల సంక్షేమం,అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుంది అన్నారు. దశాబ్ది కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను,చేస్తున్న అభివృధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా ప్రజలను భాగస్వాములను వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో జడ్పిటిసి పోశం.నరసింహారావు పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,ఎంపీటీసీలు, సర్పంచ్,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,కార్యదర్శులు నవీన్,రామిరెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు,మహిళా కార్యకర్తలు,యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !