అధ్యక్ష కార్యదర్శులుగా గడ్డం వీరన్న , దడిగల శ్రీను
మన్యం న్యూస్ గుండాల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ను ఏకగ్రీవంగా శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది అధ్యక్ష కార్యదర్శులుగా గడ్డం వీరన్న (మన్యం న్యూస్) ప్రధాన కార్యదర్శిగా దడిగల శ్రీను (మీడియా టుడే) ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా ఉండేవారు పాత్రికేయులని ప్రజల సమస్యలను ఎప్పటికీ అప్పుడు వార్త రూపంలో అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలిసే విధంగా పాత్రికేయులు చురుకైన పాత్ర పోషిస్తారని అన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వార్తా రూపంలో అధికారులకు తెలిసే విధంగా ఎల్లవేళల కృషి చేస్తామని వారు అన్నారు. ఉపాధ్యక్షులుగా బత్తిని వినయ్ (తెలంగాణ క్రాంతి) కోశాధికారిగా బొమ్మెర రవి (భద్రాద్రి న్యూస్) ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని వారు పేర్కొన్నారు. కమిటీ సభ్యులుగా కోడూరి ప్రణయ్, మండలోజు వినయ్, కొంతం నాగార్జున, వెలిశాల నరేష్ , సల్లూరి సురేష్ , గామాలపాటి నరేష్ కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు వారు పేర్కొన్నారు