- ఘనంగా తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
- మండల ప్రజాపరిషత్ కార్యలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన ఎంపిపి రేగా కాళికా
మన్యం న్యూస్ కరకగూడెం:తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, పాఠశాల లు,హాస్పిటల్, పోలిస్ స్టెషన్,గ్రామపంచాయతి,తహశీల్దారు, మండల ప్రజాపరిషత్ కార్యాలయాలలో సంబందిత అధికారులు,ఎంపీడిఓ కార్యాలయంలో ఎంపిపి రేగా కాళికా జాతీయ జెండాలను ఎగర వేశారు. ఈ సందర్భంగా ఎంపిపి తెలంగాణ రాష్ట్ర ఎర్పడిన తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకోని పదవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా అధికారులకు,ప్రజాప్రతినిధులకు,ప్రజలకు ముందు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆనాడు ప్రజలకు ఇచ్చిన హామీలు విద్య,వైద్యం,సాగు,త్రాగునీరు విద్యుత్, రోడ్లు పెన్షన్ వంటి మొదలగు సంక్షేమ పథకాలు అమలు చేస్తు ప్రజలకు చెరె విదంగా చుస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామపంచాయతి కార్యదర్శులు,సర్పంచ్ లు,ఎంపిటీసి అధికారులు పాల్గొన్నారు.