UPDATES  

 సింగరేణి అధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

  • సింగరేణి అధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
  • బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కండి
  • – జిఎం దుర్గం రామచందర్

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:జూన్ 2

మణుగూరు ఏరియాలో సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో 10వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పివి కాలనీ,రామాలయం కూడలిలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెస్సార్ జయశంకర్ విగ్రహానికి,అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులు కొమరం భీమ్,చాకలి ఐలమ్మ విగ్రహాలకు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్, ఇతర అధికారులు,టిబిజికేఎస్ యూనియన్ల ప్రతినిధులు ఇతర యూనియన్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిఎం కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రధాన కార్యక్రమం లో భాగంగా మహాత్మా గాంధీజీ,డాక్టర్ బిఆర్ అంబేద్కర్,తెలంగాణ తల్లి, ప్రొఫేసర్ డా.జయశంకర్, అమరవీరుల స్తూపం చిత్ర పటాలకు జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం జాతీయ పతకాన్ని ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం.రామచందర్ మాట్లడుతూ,తెలంగాణ రాష్ట్ర సాధనా ఉద్యమ రధ సారధి, నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ సారధ్యంలో రాష్ట్రం గత 9 సంవత్సరాలలో అనేక పధకాలు ప్రవేశ పెట్టడంతో, తెలంగాణ రాష్ట్రం అన్నీ రంగాలలో అభివృద్ధి బాటలో సాగుతూ బంగారు తెలంగాణ దిశగా దూసుకుపోతుంది అన్నారు.ముఖ్యమంత్రి కేసిఆర్ బంగారు తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసేందుకు ప్రత్యక్ష పరోక్ష తోడ్పాటు అందించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అన్నారు. కాబట్టి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సిఎండి ఎన్ శ్రీధర్ ఐఏఎస్ నేతృత్వం లో మన సింగరేణి సంస్థ 2022-23 సం॥నకు 67 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది అన్నారు. ఇదే స్ఫూర్తితో 2023-24 వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించి మణుగూరు ఏరియాను యావత్ సింగరేణిలో నెం.1 స్థానంలో నిలుపాలని ఆకాంక్షిస్తూ, సింగరేనియులందరు అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.జూన్ 5వ తేదీన సింగరేణి సంబురాల్లో భాగంగా జిఎం కార్యాలయ నుండి భద్రాద్రి స్టేడియం వరకు జరిగే సింగరేణి ప్రగతి రన్ కార్యక్రమం,అనంతరం పతాకావిష్కరణతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలను ప్రారంభించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ వేడుకలలో ముఖ్య అతిధిగా తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,గౌరవ అతిధులుగా తెలంగాణ ప్రభుత్వ విప్,రేగా కాంతారావు హాజరవుతున్నారు అని తెలిపారు.ఈ వేడుకలలో ఉత్తమ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం,ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానము చేయడం జరుగుతుదన్నారు. ప్రముఖ ఉద్యమ గాయకురాలు కుమారి స్వర్ణక్క బృందంచే తెలంగాణ సంస్కృతి పై జానపద గీతాలు, కళా నృత్యాలు,స్థానిక కళాకారులచే చక్కని సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మధ్యాహ్నం సామూహిక సహపంక్తి భోజనాలు భద్రాద్రి స్టేడియం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.అలాగే జూన్ 5వ తేదీ సాయంత్రం సిఈఆర్ క్లబ్,ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్,మణుగూరు సౌజన్యంతో భద్రాద్రి స్టేడియం లో సాయంత్రం 6.00 గంటల నుండి జరిగే కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ జానపద గాయకులు గిద్దే రాంనర్సయ్య, రాజేందర్ బృందంచే తెలంగాణ ధూంధాం కార్యక్రమాలు,అలాగే ప్రముఖ క్లాసికల్ కోరియోగ్రాఫర్ సీతా ప్రసాద్ బృందంచే శాస్త్రీయ నృత్యాలు,ప్రముఖ మిమిక్రీ కళాకారుడు రవి మిమిక్రీ,స్థానిక కళాకారులచే చక్కటి నృత్య ప్రదర్శనలు ఉంటాయి అని,సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు,యూనియన్ ప్రతినిధులు,మణుగూరు పట్టణ,పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం డి లలిత్ కుమార్,ఏజిఎం సివిల్ డి వెంకటేశ్వర్లు,ఏరియా ఇంజినీర్ నర్సీరెడ్డి,ఏఎసీ వెంకట రమణ, డిజిఎం పర్సనల్ ఎస్.రమేశ్, సీనియర్ సెక్యూరిటీ అధికారి అబ్దుల్ షబ్బీరుద్దీన్,సీనియర్ పర్సనల్ అధికారులు సింగు శ్రీనివాస్, శ్రీ వి రామేశ్వర రావు, ఇతర ఉన్నత అధికారులు, టిబిజికెఎస్ యూనియన్ నాయకులు వి ప్రభాకర్ రావు, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు,మినిస్ట్రియల్ స్టాఫ్,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !