మన్యం న్యూస్ వాజేడు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంతో పాటు గ్రామాలలో పలు చోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొదేబోయన బుచ్చయ్య మండల అధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి అధ్వర్యంలో మండలంలో పలు గ్రామ పంచాయతీలో, పాఠశాలలలో అంగన్వాడీ కేంద్రంలో, జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వాజేడు తాహశీల్దార్ యండి సర్వర్ పాషా ఆర్ ఐ కీసరి రాజు, పిఎసిఎస్ చైర్మన్ ఎగ్గిడి అంజయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణరెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు గొంది రమణారావు, కో ఆప్షన్ సభ్యులు షేక్ నిజాముద్దిన్ చెన్నం సాంబశివరావు, సీనియర్ నాయకురాలు, బత్తుల శ్రీనివాసరావు,చిలకమర్రి తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.