మన్యం న్యూస్ దుమ్ముగూడెం జూన్ 2::
మండలంలోని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రేస్ లక్ష్మీ అధ్యక్షతన జెండావిష్కరణ చేసి దశబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనులతో తాసిల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారుల సమక్షంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించి తాసిల్దార్ మణిదీప్ ఆవిష్కరణ చేశారు. మండల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు గ్రామపంచాయతీలు హాస్పటల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఆవిర్భవ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.