మన్యం న్యూస్ దుమ్మగూడెం జూన్ 2::
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ అవతరణ శతాబ్ది ఉత్సవాల తొలిరోజే పర్ణశాల గ్రామపంచాయతీ సర్పంచ్ తెల్లం వరలక్ష్మికి అవమానం ఎదురైంది. ప్రోటోకాల్ ప్రకారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆవిర్భవ దినోత్సవ వేడుకలు శతాబ్ది ఉత్సవాలు స్థానిక సర్పంచ్ పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది కానీ పర్ణశాల పంచాయతీ లో ఆదివాసి మహిళా సర్పంచ్ అనే కారణం చేతనే తనను శతాబ్ది ఉత్సవాల్లో పంచాయతీ సెక్రెటరీ ప్రసాద్ రెడ్డి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అన్ని తనే సెక్రెటరీ నేనే సర్పంచి నేనే తనకేంటి తెలిపేదని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు పంచాయతీ అభివృద్ధి విషయంలో కూడా తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అన్ని పనులు తనకి నచ్చిన వారితో చేపించుకుంటున్నారని అన్నారు సర్పంచ్ గా తను అందుబాటులో లేనప్పుడు ఉప సర్పంచ్ లేదా ఎంపిటిసి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేపట్టాలి గాని అలా కాకుండా తన సామాజిక వర్గానికి చెందిన వార్డు మెంబర్ తో జెండా ఆవిష్కరణ చేపించారని ఏజెన్సీలో ఆదివాసి సర్పంచ్ యొక్క హక్కులను మహిళనైన నన్ను అవమానించారని సెక్రటరీ అయిన ప్రసాద్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.