UPDATES  

 ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను, యూనిఫామ్ ను విడుదల చేసిన ఎంపీపీ జల్లిపల్లి

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, జూన్, 02: అశ్వరావుపేటలోని స్థానిక ఎంఈఓ కార్యాలయం నందు అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను, యూనిఫామ్ లను విడుదల చేస్తూ అన్ని గ్రామాల పాటశాలల ప్రధానోపాధ్యాయులకు పుస్తకాలను, యూనిఫామ్ ను అందజేసిన అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కొరకు అనేక రకాల వసతులను ఏర్పాటు చేయడానికి అధిక మొత్తంలో నిధులను విడుదల చేస్తూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని పాఠశాలలకు ముందే పాఠ్య పుస్తకాలు అందజేయడం జరుగుతుందని, ఈ సంవత్సరం వచ్చిన పాఠ్య పుస్తకాలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా డిజిటల్ ఫోటోగ్రఫీతో ఆయిల్ ప్రింట్ తో అత్యధిక క్వాలిటీతో అందించడం జరుగుతుందని, అలాగే ఈ సంవత్సరం నుండి కొన్ని సబ్జెక్టులకు ఆంగ్లం తెలుగు, రెండు విధాలుగా చదివే విధంగా పాఠ్యపుస్తకాలు ముద్రింపబడ్డాయని దానివలన కొన్ని సబ్జెక్టులు పార్ట్ వన్, పార్ట్ టూ గా టెస్ట్ బుక్ లు ముద్రింపబడడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ ను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు ఉండే విధంగా యూనిఫామ్ ను ఏర్పాటు చేసి కుట్టించడం జరుగుతుందని, పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో యూనిఫామ్ ప్రతి ఒక్క విద్యార్థికి అందించడం ఇవ్వడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదివి అత్యధిక మార్కులు సాధించి అశ్వరావుపేట మండలానికి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఈ విద్యా సంవత్సరంలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఎంపీపీ జల్లిపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంఈఓ కృష్ణయ్య, ప్రభాకరాచార్యులు, మహబూబ్, నారం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !