- ఉద్యమ సాధనలో పురుడోసుకున్న తెలంగాణ
- ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలిచింది
- త్యాగధనులను స్మరించు కుందాం తెలంగాణ ఖ్యాతిని చాటుకుందాం
- గడిచిన తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రగతి చారిత్రాత్మకం
- దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఆనాడు చేసిన ఉద్యమ సాధనలో పురుడోసుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ఎన్నో కొత్త పుంతలు తొక్కి అభివృద్ధి సాధనలో ప్రపంచానికే నెంబర్ వన్ గా ఉన్నదని నాడు రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన త్యాగదనం స్మరించుకుంటూ నేడు తెలంగాణ ఖ్యాతిని సగర్వంగా చాటుకుంటూ పదో సంవత్సరంలో అడుగెడుతున్న తెలంగాణ దశాబ్ద ఉత్సవాల వేడుకలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి చారిత్రాత్మకంగా నిలిచిపోయాయని ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్పష్టం చేశారు.రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి
కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లాలోచేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఐడిఓసి సమావేశపు
హాలులో ఏర్పాటు చేసిన హై టి కార్యక్రమంలో కొత్తగూడెం, ఇల్లందు శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు,హరిప్రియ, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వితీన్, అటవీ శాఖ అధికారి రంజిత్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు
సీతాలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగ మాట్లాడుతూ సిఎం కేసిఆర్ నేతృత్వంలో ఎన్నో అవమానాలు
అవహేళనలతో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాల తదుపరి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేరినట్లు చెప్పారు. ఉద్యమంలో సకలజనులంతా పాల్గొన్నారని . ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసంఇంతటి ప్రశాంతమైన ఉద్యమం చరిత్రలో ఎక్కడా జరగలేదని దన్నారు. తెలంగాణ పునర్నిర్మానం జరిగిన తదుపరి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఎంతో మంది విద్యార్థులు
ఆనాడు ఉవ్వెత్తిన ఎగిసిపడి ఉద్యమంలో పాల్గొని రాష్ట్రంలో మాకు దక్కాల్సినటువంటి నిధులు దక్కడం లేదని, మాకు రావలసినటువంటి నీళ్లు రావడం లేదని అవన్నీ పోవాలంటే స్వరాష్ట్రం మాకు కావాల్సిందేనని కొట్లాడినట్లు చెప్పారు.ఆనాటి ఉద్యమ ఫలాలు నేడు మనం అనుభవిస్తున్నామని అన్నారు . అనాటి రోజులను గమనంలోకి తీసుకుంటే
పరిపాలనలో అనేక మార్పులతో కొత్తపుంతలు తొక్కుతున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒక రికార్డు అని, సమ్మక్క సారలమ్మ బ్యారేజీ, దేవాదులతో పాటు మన జిల్లాతో పాటు ఖమ్మం, మహాబూబాబాద్ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన అద్భుతపథకం సీతారామ ఎత్తిపోతల పథకమని అన్నారు. సీతమ్మ సాగర్, భద్రాద్రి పవర్ ప్లాంట్తో పాటు జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటున్న గొప్ప రాష్ట్రంతెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర ఏర్పాటు తదుపరి అనేక రంగాలలో ముందుకు పోతున్నామని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇంకా మనం ప్రపంచంతో పోటీపడాలని, భవిష్యత్ తరాలకు సంక్షేమ ఫలాలు అందాలంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అనేక శాఖల సహకారంతో ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ప్రభుత్వం పని ఎంతోకాలంగా గిరిజనులు ఎదురుచూస్తున్న పోడు భూములకు బట్టలు మంజూరు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో త్వరలో 50వేల 595 మందికి పోడు హక్కు పత్రాలను కల్పించనున్నారని వ్యవసాయ రంగంలో అనేక కొత్త మార్పులను తీసుకొచ్చి 24 గంటల నాణ్యమైన విద్యుత్ తో పాటు వ్యవసాయ విధానాలను కొనసాగిస్తూ రైతుబంధు రైతు బీమా కల్పిస్తూ భరోసనిస్తున్న ప్రభుత్వం 67 రైతు వేదికలను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల నిధులు వ్యవసాయ రంగానికి వినియోగించారని ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన వనరుల పంటలను ఒకవైపు ప్రోత్సహిస్తూ 56301 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగును చేస్తుందన్నారు. ధరణి ద్వారా దీర్ఘకాలికంగా భూ సమస్యను పరిష్కరించు త్రావేవిక్రయాలను పారదర్శకంగా చేపట్టిందని దళిత బంధు పథకంలో కోట్ల రూపాయలతో 421 యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు . మత్స్య శాఖ సహకార శాఖ మార్కెట్ అనుసంధానం చేస్తూ పౌరసరఫరాల ద్వారా రెండు లక్షల 90 వేల 667 మంది కుటుంబాలకు 8.44 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తుంది అన్నారు . విద్యుత్ శాఖ పరిశ్రమల శాఖ మిషన్ భగీరథ పథకం జాతిన గ్రామీణ అభివృద్ధి ఆసరా పింఛన్లు హరితహారం కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ గిరిజన సంక్షేమ పథకాలు, గిరిజన సంక్షేమ శాఖలు కట్టుదిట్టంగా పనిచేస్తూదేశానికి రోల్ మోడల్గా తయారు చేయుటలో సహాకారాన్ని అందిస్తున్న ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకుస్వతంత్ర సమరయోధులకు అభినందనలు తెలిపారు.అంతకు కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో అమర వీరుల స్థూపానికి ఘన నివాళులర్పించారు.
అనంతరం ఐడిఓ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమాలలో కొత్తగూడెం, ఇల్లందు శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు, హరిప్రియ, జిల్లా కలెక్టర్
అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వరు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరావు,గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, అన్ని శాఖల జిల్లాఅధికారులు తదితరులు పాల్గొన్నారు.