మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నదని కొత్తగూడెం శాసనసభ్యులు వనమావెంకటేశ్వరావు , జిల్లా కలెక్టర్ అనిదీప్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాల్వంచ మండలం, జగన్నాధపురంరైతువేదికలో రైతు దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. వేడుకలు ప్రారంభించడానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ ట్రాక్టర్నడుపుతూ పంచెకట్లుతో హాజరయ్యారు. గ్రామ గ్రామం నుంచి వచ్చిన రైతుల ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. రైతు
సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను, సాధించిన ప్రగతిని వివరిస్తూ వ్యవసాయ విస్తరణ అధికారి ప్రభుత్వం అందించిన సందేశాన్ని రైతులకు చదివి వినిపించారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న రైతులు వారి
అనుభవాలను తెలియజేశారు. ఉత్తమ ఉత్పత్తులు, అధిగ దిగుబడులు సాధించిన రైతులు వారి యొక్క సందేశాలను ఇతరరైతులకు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా రైతుల అభ్యున్నతి కోసం చేపట్టిన
కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలు, దాని వల్ల కలిగిన లబ్ధిని రైతులకు గుర్తు చేస్తూ, భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలనుంచి సంరక్షణ కోసం పంట కాలం ఒక నెల ముందు వేయడం, ఆయిల్ పామ్ సాగు కోసం ప్రభుత్వం అందిస్తున్నసబ్సిడీలను వివరించేందుకు రైతులతో సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం రైతుబంధు,రైతు బీమా, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు, వ్యవసాయ యాంత్రీకరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ,
చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసిందని అన్నారు. వ్యవసాయరంగంలో చేసుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ నేడు ఈ వేడుకల్లో పాల్గొన్నామని చెప్పారు. జిల్లాలో పుష్కలంగా నీరు
అందుబాటులో ఉండటంతో వరి సాగు అధికంగా జరుగుతుందని, ఎకరం వరి సాగు చేసే పెట్టుబడితో 3 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేయవచ్చని, 3 సంవత్సరాల తరువాత 3 రెట్లు ఎక్కువ ఆదాయం లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రతి ఎకరం
ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అదనంగా 4 సంవత్సరాలకు కలిపి 50 వేల 910 రూపాయల సబ్సిడీని అందిస్తుందని అన్నారు. వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి గురించి మాట్లాడుతూ ఈ క్లస్టర్ పరిధిలో 2014లో మన దగ్గర వరి 2510 ఎకరాలని, నేడు 3217 ఎకరాలలో సాగు చేస్తున్నారని, 707 ఎకరాల్లో సాగు పెరిగినట్లు చెప్పారు.2014లో 812 ఎకరాల్లో సాగు చేసిన పత్తి నేడు 1157 ఎకరాల్లో సాగవుతున్నదని, 345 ఎకరాల సాగు పెరిగినట్లుఅన్నారు. గతంలో అన్ని పంటలు 3337 ఎకారాల్లో సాగైన పంటలు నేడు 4495 లకు పెరిగినట్లు రైతుల చప్పట్లతో
వివరించారు. . వెరసి అన్ని పంటలు 2014లో 3800 ఉండగా నేడు 5386 ఎకరాల్లో సాగు
చేస్తున్నామని అంటే 1586 ఎకరాలు సాగు అదనంగా వ్యవసాయంసాగుచేస్తున్నందుకుశుభాకాంక్షలు,అభినందనలుతెలిపారు.
రైతులుండగా రైతుబంధు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 16 కోట్ల 34 లక్షల 32 వేల 736 రూపాయలు వ్వయసాయం
కోసం ఎలాంటి దరఖాస్తు చేయకుండా దళారుల ప్రమేయం లేకుండా మీ బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు చెప్పారు. రైతు
కుటుంబంలో ఎవరైనా అకాల మరణం చెందితే రైతుబీమా క్రింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని చెప్పారు. ఈక్లస్టర్లో 1192 మంది రైతులు నమోదు కాగా 32 మంది రైతులు కాలం చేశారని వారికి గాను 1 కోటి 60 లక్షలు వారికుటుంబ సభ్యులు బ్యాంకు ఖాతాల్లో 5 లక్షలు జమచేశామని చెప్పారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందించామని
చెప్పారు. విద్యుత్లో నాణ్యత లేకపోవడం వల్ల విద్యుత్ మోటార్లు కాలిపోయేవని చెప్పారు. నాణ్యత కలిగిన ఉచితవిద్యుత్తును అందిస్తున్నామని, తద్వారా పంటసాగు పెరిగినట్లు చెప్పారు. ఈ క్లస్టర్లో చాలా మంది ప్రోగ్రెస్ రైతులుపామాయిల్ సాగు చేపట్టి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. మీరు ఇలాగే సాగులో ఆదర్శంగానిలవాలని చెప్పారు. ముందస్తు సాగుపై రైతులు చర్చించాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు తో సందేహాలను నివృత్తిచేసుకుంటూ లాభదాయకంగా సాగు చేయాలని కలెక్టర్ కోరారు. మార్చి చివరి నాటికి యాసంగి కోతలు జరిపేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులను క్షేత్రస్థాయిలో కలిసి అనుభవాలుతెలుసుకోవాలని, ప్రత్యామ్నాయ సాగు దిశగా ఆయిల్ పామ్ ను రైతులు ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ కోరారు. పట్టా పాస్ బుక్ ఉన్న ప్రతి రైతు ఆయిల్ పామ్ సాగు చేసి ప్రభుత్వం అందించే సబ్సిడీ పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాలసీలోభాగంగా జిల్లాలో ప్రతి సంవత్సరం రెండు పంటల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతు దినోత్సవం సందర్భంగావేసవి దృష్ట్యా వైద్యారోగ్య శాఖచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు, సాంస్కృతిక సారధి కళాకారులచే రైతుల కోసంప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పాడిన సందేశాత్మకమైన పాటలు రైతులనుఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సీతారం నాయక్, ఏడిఏ కరుణశ్రీ, ఉద్యాన అధికారి శాంతి ప్రియ, తహసిల్దార్ రంగప్రసాద్, యంపిడిఓ అప్పారావు, ఏఓ శంభోశంకర్ తదితరులు పాల్గొన్నారు.