మన్యం న్యూస్ మణుగూరు టౌన్:జూన్ 3
ఒడిషా రాష్ట్రం లోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో,శుక్రవారం సాయంత్రం పట్టాలు తప్పి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం జరగడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అంటూ అని విప్ రేగా కాంతారావు వ్యాఖ్యానించారు.ఈ ఘోర ప్రమాదంలో పలువురు మృత్యువాత పడడం, మరెందరో తీవ్ర గాయాల పాలు కావడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే మరణించిన వారి కుటుంబాలకు విప్ రేగా కాంతరావు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని,ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు తగు రీతిలో ఆదుకొని,వారికి భరోసాను కల్పించాలని ఆయన కోరారు.